బెంగళూరు సిటి సెంట్రల్ రైల్వే స్టేషన్,సమయం నుమారుగ సాయంత్రం 6 గంటలు. ట్రెయిన్
స్టార్ట్ ఐతందుకు ఇంకా ఇరవై నిమిషాలు ఉందన్న ధీమాతోటి, విరహ గీతాలను, విషాద గీతాలను ఆస్వాదిస్తు, నాకు
అన్వయించుకుంట నిమ్మలంగ నడుస్తున్న. మనిషి ఏ ఓటమినీ ఎక్కువ కాలం తలుస్కొని బాధ
పడ్తందుకు ఇష్టపడడు, ఒక్క ప్రేమ విషయంల తప్ప. మనసు మోయలేని బాధల కూడ
దానికి కారణమైన తన ప్రేయసిని తలుస్కొని సంతోషిస్తడు.
మనసంతా ప్రేమను నింపుకొని, నా ప్రియురాలు
తప్ప, మనుషులల్ల లింగ భేదాన్ని ఎన్నడో మర్చిపోయిన
నాకు నా వయసును గుర్తు చేస్తు తారసపడ్డది ఒక అద్భుతమైన, అద్వితీయమైన అందం. తన ముఖ వర్ఛస్సుతోటి పోటి పడలేక, అలసిపోయి ఓటమిని అంగీకరిస్తూ సూర్యుడు
అస్తమిస్తున్నట్టుంది.ఈ విషయం ముందే తెలిశి, సిగ్గుపడి మబ్బుల సాటున దాసుకున్నడేమొ ఆ చంద్రుడు. ఆ అమ్మాయిని చూశిన తర్వాతనే
తెలిశింది, అమ్మాయిల అందానికి పదహారణాలను(36-24-36) ఎందుకు
ప్రామణికంగ వాడుతరొ. ఎంత గొప్ప కవి అయినా ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తందుకు తన
సాహిత్యం, నైపుణ్యం సరిపోవని పశ్చాత్తాప పడితీరుతడు.
అంతటి అందాన్ని చూశిన తర్వత కూడ, దానికి దాసోహం
కాకుండ నా మనసు నన్ను ప్లాట్ఫారం వైపే నడిపిచ్చింది. అప్పుడు నా మీద, నా ప్రేమ మీద మస్త్ గర్వం కలిగింది. కని ఏ
మూలనో తన అందం నా మనసు మీద ప్రభావం చూపిచ్చిందని గమనించలేదు నేను, గమనించినా నా ప్రేమ దానికి ఒప్పుకోనియ్యలేదేమొ.
నేను కూసోవాల్సిన భోగి దగ్గరికి వచ్చిన. ఏమైందొ తెలవదు, ఎన్నడు లేనిది నేను నాతోటి ప్రయాణికులెవరని చార్ట్ వైపు చూశిన. నా పక్కనే
పదహారేళ్ల అమ్మాయి,
లోకం పోకడ కూడ తెలవని
చిన్న పిల్ల అనుకొని రైలెక్కిన. అయినా రోజుకో రంగును మార్చే ఈ లోకం తీరు అర్థం
చేసుకోవడం తల పండిన మేథావులకు కూడ సాధ్యం కాదేమొ.
రైలు కదిలింది,
కాలక్షేపం కోసం నవలలు
చదువుదామని నా బ్యాగ్ ని అందుకున్న. ఇంతల్నే ఎవరో అమ్మాయి వచ్చి కన్నడల "అమ్మ, ఇక్కన్నే మన సీట్లు" అంది. ఆశ్చర్యం! నేను
చూశిన ఆ అపురూపమైన అందం నా పక్కనే కుసోబోతుందా! దేవుడు నా ప్రేమకు కఠిన పరీక్షను
పెట్టదలశిండని నాకు అర్థమైంది. తను నా పక్కన కాకుండ ఎదురుంగ కుసున్నది. అంతటి
సౌందర్యరాశి నా పక్కన కుసునె అదృష్టంగానీ, అర్హతగానీ నాకు లేవనుకున్న. తనతో పాటు వాళ్ల అమ్మ, ఇంకో నడి వయస్కురాలు(పెళ్లి చేసుకోకుండ, రాజకీయాలళ్ల ఉంటే యూత్ లీడర్ లెక్కన చలామణి కావొచ్చు) ఉన్నరు. తనని నిశితంగ
మళ్లోసారి గమనించిన,
వయసుకు మించిన పరువం
తనది. పువ్వు లెక్కన కనిపిస్తున్న మొగ్గ ఓలె తోశింది తను నాకు. కని పూల నుంచి
తేనెను జుర్రుకోవాలనే తుమ్మెదకు అంత ఙ్ణానం ఉండదేమొ.
దృష్టి మరలుద్దామని చలం వ్రాశిన మైదానం చదువుతున్న. "చూపు వీపును
తాకుతుంది" అన్న కాన్సెప్ట్ ని 1927 లనే వ్రాశిన గొప్ప రచయిత అతను. పేజీలు
తిప్పుతున్నప్పుడు కాకతాళీయంగ నా చూపు తన మీద పడ్డది. నా కళ్లను నేనే
నమ్మలేకపొయిన. మా తల్లిదండ్రుల పెంపకం, స్త్రీల పట్ల నాకు ఉన్న గౌరవం, చివరికి నా
ప్రేమను కూడ నా మతిలకి రానియ్యలేదు నా కళ్లు.
తనకు ఎదురుంగ, నా పక్కన కూసున్న తన వాళ్లతోటి మాట్లాడుతు, డైనింగ్ ప్యాడ్
ని సపోర్ట్ చేసుకొని కిటికి పక్కనే ఒంగి కూసుంది. నాగరికత పేరుతోటి పాశ్చ్యత్త
వస్త్రధారణ రాజ్యమేలుతున్న ఈ జమానల, అసలే బరువైన వక్ష సంపదను కలిగిన తనకు చున్నీ
ఏసుకోవడం ఇంకా బరువనిప్చిందేమొ. తను నా పక్కన కాకుండ నా ఎదురుంగ కూసున్నందుకు
మిక్కిలి ఆనందం కలిగింది.
ఆ బ్రహ్మ సృష్టిల ఆడతనానికి మించిన అందం ఇంకోటి లేదు అనడం అతిశయోక్తి
కాదనిపిచ్చింది. కళ్లు మూస్తె ఈ అందం మళ్లీ కనపడదేమొ అని,
కల లెక్కన కరిగిపోతదేమొ
అని కను రెప్పలు వాల్చడం కూడ బంద్ చేశిన. నా మనసు నా ఆధీనంల లేదు, నా శరీరం కూడ
అదుపు తప్పుతుందని భయమయ్యింది. చిన్నప్పటి నుంచి ఒంట పట్టిచుకున్న విలువలు
చెయ్యబట్టో, అందరి ముందు తననేం చేయలేని అసహయత చేయబట్టో, నా మనసు, తనువు చూపులతోటె సంతృప్తి చెందినయి.అడవికి
రాజైన సింహం కూడ ఒందలుగా ఉన్న బర్ల మందను చూశి భయపడ్తది. నాలోపల కూడ ఒక మృగం ఉందని, ఒక స్త్రీ వల్ల
అది మేల్కోగలదని ఆ రోజే తెలిశింది నాకు.
పాపం చిన్నపిల్ల, నేను తనను ఎందుకు చూస్తున్ననో, తన నుంచి ఎం
ఆశిస్తున్ననో కూడ తెలుసుకోలేని వయసు తనది. కలుగుతున్న కోర్కెను
నియంత్రించుకుంటదుకు నేను పడుతున్న అవస్థను గమనిచ్చిర్రో లేదా నా కళ్లల్ల
రగులుతున్న వాంఛను గమనిచ్చిర్రో కని, ఆ పెద్దామె ఆ అమ్మాయిని ఒంగకుండ సక్కగ
కూసొమన్నది. తను కూసుంది, కని కొంచెం ఇబ్బంది పడ్తుంది. నేను మాత్రం బయటి
ప్రపంచంతోటి సంబందం లేదన్నట్టు చూపులతోటె తన అందాన్ని అనుభవించాలనే విఫల యత్నం
చేస్తున్న. ఇంక లాభం లేదని వాళ్ల అమ్మ తనకో శాలువను ఇచ్చింది సుట్టుకొమ్మని. బహుశా
ఎన్నడు ఆంక్షలు విధించని వాళ్ల అమ్మ ఈ రోజు ఎందుకిట్ల ప్రవర్తిస్తుందో అర్థం కాక ఆ
అమ్మాయి, శాలువ పూర్తిగ
కప్పుకోలేక, సక్కగ కూసొలెక ఇబ్బంది పడ్తుంది.
కొంచెం సేపైన తర్వాత, నాలోపల ఉన్న మనిషి మేల్కొని తనను ఇబ్బంది
పెట్టకుడదనో, ఇంక ఏం కనిపియ్యదన్న నిరాశతోటో అప్పర్ బెర్త్ ఎక్కిన. ఎటువంటి కల్మశం లెకుండ
చేశిన ఆ చర్య నాకు లాభాన్నే కలిగిచ్చింది. నాలోని మృగం మళ్లీ నిద్ర లేశింది.
ఆ తెల్లారి, జరిగిందంత సమీక్షించి చూస్తే సమధానం దొరకని ప్రశ్నలే తప్ప, ఆవగింజంత
పశ్చ్యాత్తాపం కూడ కలగలేదు నాకు.
"పురుషుడు స్త్రీని మోహించడం సృష్టి రహస్యమే
తప్ప, స్త్రీని
అగౌరవపరచడం కాదని, ఆ ఈశ్వరుడే మోహిని అవతారంల ఉన్న విష్ణువును
చూశి పంచ తడుపుకున్నప్పుడు, మాములు మనిషిని నా వల్లేమైతుంది" అని
సమర్థించుకునే నాదా తప్పు?
"తను ఎట్లుండాలి, ఎటువంటి బట్టలేసుకోవలి అనే కనీస స్వేచ్ఛను కూడ
కాలరాస్తున్న ఈ మొగోళ్లే మారాలి” అని దురాశపడుతున్న
ఆ అమ్మయిదా తప్పు?
ఆంక్షలు, స్వేచ్ఛ... ఆటి పర్యవసానాలు, ఏది మంచి, ఏది చెడు అని తనకు తెలియజెప్పని ఆమె తల్లిదా
తప్పు?
లేదా స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ శక్తిని కల్గించిన ఈ సృష్టిదా తప్పు?
సృష్టిని తప్పు ఎంతలేక తప్పు మనపై వేసుకొడమే.....ఆలోచనాత్మకమైన టపా
ReplyDeleteThanks for your compliment, Padmarpita :-)
Deleteతప్పుచేయడమే కాని ఎంచతరమా:-)
ReplyDelete